ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కెక్కడిది అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. 'చంద్రబాబుకి మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి, నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడం ఏంటి?' భువనేశ్వరి అని ట్వీట్ చేశారు.