ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా లోకేశ్ అనుచరుడు కిలారు రాజేశ్ సీఐడీ అధికారులకు లేఖ రాశారు. ఇవాళ కొన్ని డాక్యుమెంట్లు తీసుకురావాలని సీఐడీ ఆదేశించగా, ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, దసరా తర్వాత తీసుకొస్తానంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా, నిన్న సీఐడీ విచారణకు రాజేశ్ హాజరైన విషయం తెలిసిందే. ఇవాళ కూడా అధికారులు పలు ప్రశ్నలు అడగనున్నారు.