శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఒరువాయి గ్రామ సచివాలయం ఆవరణలో ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నల్లచెరువు ఎంపీపీ రమణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించే వ్యక్తిగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు.