గుంతకల్లు పట్టణంలోని మొడినాబాద్ ఏరియాలో లాల్ బహదూర్ శాస్త్రి మున్సిపల్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున, అసిస్టెంట్ కమిషనర్ లావణ్య పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు వచ్చిన ప్రజలకు మెరుగైన పరీక్షలు, చికిత్సలు, మందులు అందించాలని అక్కడి వైద్యులకు, మెడికల్ సిబ్బందికి ఆమె సూచించారు.