క్యూఆర్ కోడ్ స్కానింగ్ విషయంలో సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-మెయిళ్లకు వచ్చే క్యూఆర్ కోడ్‌లను ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇమేజ్ రూపంలోని టెక్స్ట్, క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ-మెయిళ్లను నేరగాళ్లు పంపించి, మోసాలకు పాల్పడుతున్నారని ఆ కోడ్‌లను స్కాన్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.