వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో వాతావరణం మండువేసవిని తలపిస్తుంది. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏటా ఈ సమయానికి వర్షాలతో ఆహ్లాదకరంగా ఉండేది. అక్టోబర్ మూడోవారం వచ్చిన వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. చల్లబడటం లేదు వేసవి మాదిరిగా ఉదయం7 గంటల నుంచి ఉక్కబోత మొదలవుతుంది. సాయంత్రం ఐదుగంటల వరకు వేడిగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. సగటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35డిగ్రీల వరకు నమోదవుతుంది.