విశాఖలోని 51వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ బుధవారం నిర్వహించారు. పేదల ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పించేందుకు సీఎం జగన్ ఈకార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు వైద్యుల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.