తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పాడిపంటలతో ఉండాలని, రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.