టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. కోర్టు ఈ విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ అంశాన్ని ప్రస్తావించారు. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.ఈ కేసులో నేటి వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్ 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దీంతో ఏసీబీ కోర్టులో విచారణపై స్టే నవంబర్ 7 వరకు పొడిగించినట్లే అవుతుందంటున్నారు. వచ్చే నెల 7 వరకు చంద్రబాబు అరెస్ట్‌కు అవకాశం ఉండదు కాబట్టి స్వల్ప ఊరట లభించినట్లే అవుతుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. దీనిపై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు.ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ నెల 9వ తేదీన తీర్పు ఇచ్చింది. చంద్రబాబు తరఫున లాయర్లు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.