ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 2023వ సంవత్సరం వైయస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులు– ఎచీవ్మెంట్ అవార్డులను కమ్యూనికేషన్స్ ఎడ్వైజర్ జి.వి.డి.కృష్ణమోహన్ ప్రకటించారు. వరసగా మూడో సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని కమిటీ ప్రకటిస్తోంది. కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు– ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సభ్యులుగా ఉన్నారు.