చంద్రబాబు కోసం హెరిటేజ్ మూయరు..బాలకృష్ణ రిలీజ్ ఆపరు కానీ, ప్రజలు మాత్రం చంద్రబాబు కోసం నిరసనలు చేయాలా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి నిలదీశారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు. రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరని కారుమూరి విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.