చిత్తూరు జిల్లా, యాదమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడ్రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. సాయంత్రం మెయిన్ బజారులో క్రీడాకారులు డ్రమ్స్ వాయిస్తూ ర్యాలీగా పాఠశాల మైదానానికి చేరుకున్నారు. వైస్ ఎంపీపీలు రవీంద్రబాబు, హరినారాయణరెడ్డి, ఎస్ఐ సుమన్, సర్పంచ్ ఝాన్సీ, ఎంపీటీసీ డానియేల్, రాష్ట్ర ఖోఖో సంఘ కార్యదర్శి సీతారామరెడ్డి, కన్వీనర్ ప్రసాద్, జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి శరత్‌బాబు, జిల్లా చీఫ్ కోచ్ బాలాజి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, పీడీలు పాండ్యన్, రాజేష్, ముత్తు, దేవేంద్ర పాల్గొన్నారు. సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వెలుగులో చిత్తూరు-వెస్ట్ గోదావరి, కర్నూలు- తూర్పు గోదావరి జట్ల మధ్య మొదలైన పోటీలు రాత్రి వరకు కొనసాగాయి.