రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, ఢిల్లీల్లో మీడియా సమావేశాలు నిర్వహించి సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా స్కిల్ డెవల్‌పమెంట్ కేసు వివరాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వెల్లడించారని, వారి పర్యటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర న్యాయ శాఖ, హోం శాఖ ముఖ్య కార్యదర్శులు, మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. కోర్టుకు వెల్లడించాల్సిన దర్యాప్తు వివరాలను పత్రికా సమావేశాలు పెట్టి వెల్లడించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై చర్యలు తీసుకునేలా సీఎస్, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించండి అని కోర్టును అభ్యర్థించారు.