టీటీడీ ఆదాయం నుంచి ఒక శాతం నిధులను తిరుపతి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాలని ఇటీవల బోర్డు చేసిన తీర్మానాన్ని ఉపసంహరించాలని వీహెచపీ జిల్లా కార్యదర్శి చింతపర్తి మహేష్ డిమాండు చేశారు. ఆమేరకు శనివారం రాయచోటిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్య క్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ బోర్డు తీర్మానాన్ని ఉపసంహరించుకునేంత వరకూ వీహెచపీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. శనివారం నాటి నిరసన కార్యక్రమాల్లో హిందూ బంధువులు, వేంకటేశ్వరస్వామి భక్తులు, థార్మిక, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కలిసి రావాలని మహేష్ కోరారు. వీహెచపీ నాయకులు హరిప్రతాప్ రాజు, రమేష్‌బాబు, నాగరాజలతో కలిసి మహేష్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.