సైబర్ ప్రపంచంలో నేరగాళ్లు చీకటి ప్రపంచంలో ఉండి ప్రభుత్వానికి, పోలీసులకి సవాళ్లు విసురుతున్నారని.. వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారు. నేర నిరోధం, నేర దర్యాప్తులో ఏపీ పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే ముందున్నారని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలో సచివాలయాల్లో నియమించామన్నారు. దిశాయాప్, పోలీస్ స్టేషన్‌లు, పీపీలను నియమించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.