గంగాధరనెల్లూరులో శుక్రవారం సాయంత్రం టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిలు, యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లతో టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ థామస్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువే ఉందని, నేతలందరూ ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుత మంత్రులలో 15మంది ఓడిపోయే పరిస్థితి ఉందని అధికార పార్టీ సర్వేరిపోర్టులే తేల్చేశాయని, అందులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముందువరసలో ఉన్నారన్నారు. మానసికంగా దెబ్బతిని నారా భువనేశ్వరి, లోకేశ్, చంద్రబాబునాయుడుపై నారాణస్వామి పిచ్చి కూతలు కూస్తున్నారు అని ఆరోపించారు.