ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సహకాలకి దరఖాస్తులు ఆహ్వానము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2023, 05:15 PM

జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించ నున్నట్లు పేర్కొన్నారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం కింద అందిస్తారని చెప్పారు. 2023-ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఎన్‌ఏఎన్‌ఏబీహెచ్‌యూ ఎంఐ.ఏపీ.జీవోవీ.ఇన్‌ పోర్టల్‌లో అందించిన వెబ్‌లింక్‌ ద్వారా వచ్చేనెల 4వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa