సీపీఎస్ కోరుకుంటున్న ఉద్యోగుల పాలిట జీపీఎస్ బిల్లుకు ఆమోదం శాపమేనని నవ్యాంధ్ర టీచర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి, నాలుగేళ్ల తర్వాత జీపీఎస్ అనే గుదిబండను రుద్దడం సిగ్గుమాలిన చర్యన్నారు. సీపీఎ్సలో ఎలాంటి ప్రయోజనాలూ లేకపోగా, జీపీఎ్సలో అసలు గ్యారెంటీనే లేదన్నారు. నాలున్నరేళ్లలో ఒక్కసారీ ఒకటో తేదీన జీతాలివ్వని ప్రభుత్వం, రాబోయే 70ఏళ్లను దృష్టిలో పెట్టుకుని జీపీఎస్ తెచ్చామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.