జీరో బడ్జెట్ రాజకీయాలు అనే అంశం మీద తాను అభిప్రాయాలు చెప్పలేదని జనసేన అధినేత పవన్ తెలిపారు. ‘నేను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి చెప్పలేదు. ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికిప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు. పార్లమెంట్, ఏపీ శాసన సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధుల పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది కావున అర్ధం చేసుకొని ముందుకు సాగాలని నేతలని కోరారు.