రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పడి నుండి ఉపాధ్యాయ పోస్టుల మంజూరు చేయడం పక్కనుంచి ఉన్నవే రద్దు చేస్తోందని ఎస్టీయూ నాయకులు ధ్వజమెత్తారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టారు. ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ ..... ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉపాధ్యాయ పోస్టు మంజూరు చేయలేదన్నారు. ఏకంగా 5 వేలకు పైగా పోస్టులు రద్దు చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను రద్దు చేయాలని, పాత పెన్షన పునరుద్ధరించాలని కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యుడు, ప్రధానకార్యదర్శి రమణారెడ్డి, చంద్రశేఖర్, కృష్ణమూర్తి, రామాంజనేయులు, ఫణి భూషణ్, ప్రసాద్, రంగనాథ్, రాజశేఖర్, రవి పాల్గొన్నారు.