మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధానాలు, ప్రజోపయోగ అంశాల మీద మాత్రమే మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సృష్టం చేశారు. ‘ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ విధానాలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాల గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి. అన్ని మతాలను ఓకేలా గౌరవించాలి. దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడడం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి అని ఆదేశించారు.