రాజమండ్రిలో జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా మేనిఫెస్టో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..... ‘ చంద్రబాబు విజన్ -2020 అంటే నేను ఏదో అనుకున్నాను. కానీ మన కళ్ళ ముందు జరిగింది.. చంద్రబాబు విజన్ ఏమిటి అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అవసరం. అనుభవం ఉన్న నాయకుడు అవసరం. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం. మనం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం.. చిన్న లోపం కూడా రాకూడదు. అందరం అప్రమత్తంగా ఉండాలి’ అని చెప్పారు.