చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఉత్తరాంధ్ర వాసులు, టీడీపీ అభిమానులు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే పుంగనూరులో సైకిల్ యాత్రను అడ్డుకొని... మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అవమానించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల చర్యలు ఖండిస్తూ విశాఖ, జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... పెద్దిరెడ్డి ఎప్పుడూ దేవుడి మాలవేసుకుంటారు. కానీ చేసేవన్నీ పాపాలే. మీకే కాదు.. మాకు కూడా అడ్డుకోవడం తెలుసు. ఈ విషయం గ్రహించాలి. ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు లేఖ రాయడం మాకు కూడా దైర్యాన్ని ఇచ్చింది. ఈ లేఖను కూడా వైసీపీ నేతలు తప్పు బట్టడం వారి దౌర్భాగ్యం అని నేతలు అన్నారు. ఇందులో పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, చిరంజీవి పాల్గొన్నారు.