పుంగనూరులో టీడీపీకిచెందిన నలుగురు వ్యక్తులకు జరిగింది అవమానం కాదని... యావత్ ఉత్తరాంధ్రను అవమానించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలియజేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఒక్క ఆధారం చూపించగలరా? అని నిలదీశారు. జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామన్నారు. కాలయాపన చేసి చంద్రబాబును జైలులో నిర్బంధించాలని చూస్తున్నారని, న్యాయం ఒకరోజు ఆలస్యంగా అయినా గెలుస్తుందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని అన్నారు.