కర్నూలు జిల్లా, దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో భాగంగా మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనల పలువురి భక్తుల తలలు పగిలాయి.కాగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి కొందరు భక్తులు ఎక్కారు. దీంతో బరువు ఎక్కువకావడంతో చెట్టు కొమ్మ విరిగి పలువురు భక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గణేష్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నఆలూరు వాసిగా గుర్తించారు. కాగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొక వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాల గ్రామానికి చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొంతమంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.