కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గురువారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కు చెందిన వారు రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే వివరాలు ఆరా తీశారు. చనిపోయిన వారంతా కూలీలే కావడం బాధాకరమన్నారు. మృతులకు సంతాపం తెలిపారు.