ఒంగోలు నగరం మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్‌లోని ఈవీఎంలను ఇంజనీరింగ్ బృందం తనిఖీ చేస్తున్న అంశాలను కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ....... 12 బృందాలతో ఈవీఎంల తనిఖీలు కొనసాగుతుందని, మరో రెండు బృందాలను అదనంగా ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 30శాతం ఈవీఎంల తనిఖీ ప్రక్రియ పూర్తి అయ్యిందని, ఎన్నిక ల కమిషన్ నిర్దేశించిన నవంబరు 10వతేదీలోపు ఈ యంత్రాల తనిఖీ ప్రక్రి యను పూర్తిలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్నికల సె ల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa