ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ హోటల్ లో దొంగ కూల్ డ్రింక్ తాగి రెస్ట్ తీసుకుని మరీ చోరీకి పాల్పడ్డాడు.. ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న నక్షత్ర హోటల్లో యజమాని రాత్రి హోటల్ని మూసివేసి ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో వెనుక భాగం నుంచి హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న లక్షా 30వేల నగదును తీసుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.