బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిపై వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం పై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. రాబోవు రోజుల్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.