రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాలలో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణానంతరం పరిశ్రమల్లో ఉద్యో గావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.