విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపంతో పట్టాలపై నిలిచిపోయిన విశాఖ- రాయగడ రైలును పలాస ఎక్స్ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టగా.. మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న గూడ్స్ రైలుపైకి దూసుకెళ్లాయి. దీంతో.. బోగీలు తుక్కుతుక్కయ్యాయి. బోగీల్లో ఉన్న ప్రయాణీతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. విద్యుత్ వైర్లు కూడా తెగిపోవటంతో.. ప్రమాదస్థిలిని అంధకారం అలుముకుంది. దీంతో.. బోగీల శిథిలా కింద ఇరుక్కుని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో.. ప్రమాదం స్థలం భీతావహ దృశ్యాన్ని తలపిస్తోంది.