ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అటువంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. కాగా, తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు యాపిల్ నుంచి తమకు సమాచారం అందిందని అసదుద్దీన్, శశి థరూర్, చతుర్వేది, ఏచూరి, రాఘవ చద్దా చెబుతున్నారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.