ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తాహసీల్దారు మీసాల దానియేలు, ఎంపీడీవో ఫణికుమార్ అన్నారు. గురజాల మండలంలోని పాత అంబాపురంలో గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తాహసీల్దారు, ఎంపీడీవో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.