బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం కూడా కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. భిక్కనూరు, రాజంపేట మండలాల పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు బిక్కనూరు మండల కేంద్రంలో, దోమకొండ, బీబీపేట మండలాల కార్యకర్తల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు దోమకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఆయా సభల్లో పార్టీ శ్రేణులు అందరూ హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం మరో రెండు సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు.