103 సంవత్సరాలుగా కార్మిక శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న సంఘం తమది ఒక్కటేనని ఏఐటీయూసీ చీరాల నియోజకవర్గ కార్యదర్శి అచ్యుతుని బాబురావు చెప్పారు. మంగళవారం ఏఐటీయూసీ 104 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చీరాల పట్టణంలో ఘనంగా జరిగాయి. అనేక ప్రాంతాల్లో ఏఐటీయూసీ జెండాను కార్మికులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరం కాలం లోనే ఏఐటియుసి కార్మికుల పక్షాన నిలిచిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa