టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో యువనేత చర్చించనున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబుపై ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేస్తుండటంతో న్యాయ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయ నిపుణులతో నారా లోకేష్ చర్చించనున్నారు.