తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనపై దాడి జరిపిన అధికారుల్లో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారని ఫిర్యాదు చేశారు. లోకసభ నేతగా ప్రధాని తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్ఐఏల దర్యాప్తుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడి పట్ల విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు.