అనకాపల్లి పట్టణంలో చింత వారి వీధిలో నివసిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లా విశ్రాంత జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పిఎస్ సూర్యనారాయణ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రెండేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసిన ఈయన అనకాపల్లి పట్టణంలో రవి హాస్పిటల్స్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈయన మరణ వార్త తెలుసుకొని పట్టణంలోని ప్రముఖ వైద్యులు, ప్రముఖులు గురువారం నివాసానికి విచ్చేసి నివాళులర్పించారు.