విశాఖ జిల్లాలో వెనకబడిన కులాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర రావు దృష్టికి తీసుకు వెళ్లినట్లు జిల్లా అధ్యక్షుడు పల్లా రమణ తెలిపారు. ఈ మేరకు గాజువాక వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికి పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. బీసీల హక్కుల సాధన, జనగణన వంటి అంశాలపై పోరాడుతున్నట్లు శంకరరావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు