స్టీల్ ప్లాంట్ పైన, కార్మికులపైన యాజమాన్యకుట్రలను ఉద్యమాలతో తిప్పికొట్టండని స్టీల్ సిఐటియు గౌరవఅధ్యక్షుడు జె అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. గురువారం ఉక్కు కర్మాగారంలో స్టీల్ సిఐటియు, మిత్రపక్షాల ఆధ్వర్యంలో స్టీల్ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయాలని ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి పాదయాత్ర చేసి వారిని ప్రశ్నించారు.