పల్నాటి ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గురువారం మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కరువు విలయతాండవం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చోద్యం చూస్తున్నారని అన్నారు.