ప్రజాసమస్యల సత్వర పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం రూపొందించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం తెనాలి స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. జస్వంతరావు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు, వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు కూడా పాల్గొనే కార్యక్రమంలో అర్హులై ఉండి లబ్ధి పొందని ప్రజలు వారి సమస్యను అధికారుల దృష్టికి తేవాలని ఆయన కోరారు.