టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్‌కు లేదని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు. రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా.. అలాగే పెట్టారు. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐల విచారణను పురందేశ్వరి కోరితే.. జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు. జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగనులో భయం పట్టుకుంది అని వాపోయారు.