నెల్లూరుజిల్లా, ఆత్మకూరులో యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్ళితే... పట్టణంలోని బైక్ మెకానిక్ షాపులో వినయ్ పనిచేస్తున్నాడు. పాత గొడవుల విషయంలో మెకానిక్ షాపుకు చెందిన వారితో ఈ వివాదం చెలరేగింది. వినయ్‌ను మెకానిక్ షబ్బీర్‌తో పాటు మరో నలుగురు యువకులు తీవ్రంగా కొట్టారు. యువకులు దాడితో తీవ్ర మనస్థాపానికి లోనై వినయ్ బుచ్చిలోని తల్లిదండ్రుల ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వినయ్‌పై యువకులు దాడికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతుంది.