ఢిల్లీలో రోజు రోజుకి వాయు కాలుష్య తీవ్రత పెరిగుతూండడంతో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వాయు కాలుష్యం పెరుగుతున్నా.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆచూకీ లభించట్లేదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. పొల్యూషన్ అరికట్టడానికి కేజ్రీవాల్ సర్కార్ తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.