దేశంలోని ఆన్‌లైన్ గేమర్స్‌లో 41 శాతం మంది మహిళలు ఉన్నట్లు లుమికాయ్ గేమింగ్ సంస్థ వెల్లడించింది. గేమర్స్‌లలో 18-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతులు, మహిళలు 50 శాతం మంది ఉన్నారన్నారు. ఇక దేశంలో మొత్తంగా 66 శాతం మంది నాన్ మెట్రో ప్రాంతాల వారే ఉన్నారన్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ గేమింగ్ మార్కెట్ 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని సంస్థ అంచనా వేసింది.