ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజులుగా శరణార్థి శిబిరాలపైనా దాడులు జరుగుతుండటంతో గాజాలో సురక్షిత ప్రాంతమనేదే కరవైందని ఐరాస సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో 70 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ తెలిపింది. గురువారం ఆ సంస్థ కమిషనరు ఫిలిప్ తొలిసారి గాజాలో సహాయక సిబ్బందిని పరామర్శించారు. గాజాలోని ప్రజలకు మద్దతుగా మా సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని ఫిలిప్ తెలిపారు.