ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన వైయస్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రెంటచింతల నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకష్ణదేవరాయలు, నందిగం సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రకు వేలాది ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాచర్ల శివారు నుంచి పాదయాత్రగా పట్టణంలోని పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మాచర్ల నేతలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం భారీ జన సందోహం మధ్య సభ ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాల పేదలకు చేస్తున్న మేలును నేతలు వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్.., జగన్ రావాలి– జగనే కావాలి’ ‘వై నాట్ 175 ’ అంటూ నినదించారు.