వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకొనసాగుతుంది. భారత దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత సీఎం జగన్ దని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. ఇది బడుగు, బలహీనవర్గాలకు సీఎం వైయస్ జగన్ అందించిన ఫలమని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలోని పార్క్ సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వివరించారు. 70 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గా చూసిన సీఎంలను గతంలో చూశామని, సీఎం వైయస్ జగన్ మాత్రమే ఈ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించి వృద్ధిలోకి తెస్తున్నారని అన్నారు.