సీఎం వైయస్ జగన్ పేదింటి పిల్లలను అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రాజధాని ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి గూడు కల్పించాలని జగనన్న కలలు కన్నారన్నారు. వీటన్నింటినీ ఓర్వలేని చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా ద్వితీయ శ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి ఉన్నతికి పాటు పడుతున్న సీఎం వైయస్ జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. వైయస్ జగన్ డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకంగా 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కుల గణన చేస్తామని కాకమ్మ కథలు చెప్పాయని, సీఎం వైయస్ జగన్ దాన్ని ఆచరణలో పెడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సీఎం వైయస్ జగన్ పల్నాడుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, వరికపూడిసెలకు అనుమతులు సాధించారని, రూ.3 వేల కోట్లతో హైలు అభివృద్ధి చేయించారని, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తన్నారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామని చెప్పారు.